ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

గుంటూరులో ద్రవరూప గంజాయి విక్రయం...8మంది అరెస్ట్ - గుంటూరు తాజా వార్తలు

గంజాయిని ద్రవరూపంగా మార్చి...విక్రయిస్తున్న ఎనిమిది మంది నిందితులను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 8 కిలోల గంజాయి, 55 గంజాయి లిక్విడ్‌ సీసాలు, రూ.30వేలు నగదు, 8 చరవాణీలను స్వాధీనం చేసుకున్నారు.

guntur-police-have-arrested-8-people-who-sell-cannabis
గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి

By

Published : Jul 5, 2020, 3:40 PM IST

సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి గంజాయిని ద్రవరూపంగా మార్చి విక్రయిస్తున్న 8 మంది ముఠాను అరెస్ట్ చేసినట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన విద్యార్థులు గంజాయి విక్రయాలకు పాల్పడినట్లు అర్బన్ ఎస్పీ వివరించారు. నిందితుల వద్ద నుంచి 8 కేజీల గంజాయి, 30వేల నగదు, 55 గంజాయి లిక్విడ్ బాటిల్స్, 9 చరవాణీలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

కేసులో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని అయన అభినందించారు. గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని... విద్యార్థులకు తరచూ కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. గుట్కా సరఫరా చేసే మూలాలను గుర్తించి... వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఇవీ చదవండి:కర్ణాటక మద్యం పట్టివేత... మూడు వాహనాలు సీజ్

ABOUT THE AUTHOR

...view details