కర్నూలు జిల్లాలో సంచలనం సృష్టించిన అబ్దుల్ సలాం కేసులో మరో పరిణామం చోటు చేసుకుంది. ఆత్మహత్య కేసులో నిందితులైన సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ కు బెయిల్ మంజూరైంది. నంద్యాల మూడో అదనపు జిల్లా కోర్టు బెయిల్ ఇస్తూ తాజా ఉత్తర్వులిచ్చింది.
పోలీసుల పిటిషన్.. బెయిల్ రద్దు
సలాం కేసులో గత నెలలో వారికి మంజూరైన బెయిల్ రద్దు చేయాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఈనెల రెండో తేదీలోపు సీఐ, హెడ్ కానిస్టేబుల్ను లొంగిపోవాలని ఆదేశించింది. న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు రెండో తేదీన ఇద్దరూ లొంగిపోగా...వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. కర్నూలు జైలులో ఉంటున్న వారికి ఇవాళ బెయిల్ లభించింది.