హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు ఎనిమిది కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు ఎయిర్పోర్ట్ కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ శివకృష్ణ తెలిపారు. దీని విలువ సుమారు 6.62 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేసినట్టు వివరించారు. ఈ నెల 3న తెల్లవారుజామున సరైన పత్రాలు లేకుండా బంగారు బిస్కెట్లు, ఆభరణాలతో కూడిన పార్శిల్‌ను హైదరాబాద్ నుంచి ముంబయికి ఎయిర్ కార్గో ద్వారా అక్రమంగా తరలించేందుకు యత్నించంగా అనుమానంతో తనిఖీ చేశామన్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత - శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
హైదరాబాద్‌లో శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్‌జీఐఏ)లో భారీ మొత్తంలో బంగారం పట్టుబడింది. హైదరాబాద్ నుంచి ముంబయికి ఎయిర్ కార్గో ద్వారా అక్రమంగా తరలిస్తున్న బంగారంతో కూడిన కొరియర్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
gold seized in shamshabad-airpor
పార్శిల్ తెరచి చూడగా వివిధ రకాల బంగారు ఆభరణాలు, విదేశీ బంగారు కడ్డీలు, వజ్రాలు, విలువైన రాళ్లు, స్టెయిన్‌లెస్ స్టీల్ గడియారాలు, ప్లాటినం టాప్స్, పురాతన నాణేలు గుర్తించామని శివకృష్ణ తెలిపారు. స్వాధీనం చేసుకున్న బంగారంలో బిస్కెట్లు 2.37 కిలోలు, ఆభరణాలు 5.63 కిలోలు ఉన్నట్టు వెల్లడించారు. తదుపరి విచారణ కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు.