ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

చోరీ కేసును ఛేదించిన పోలీసులు... 62 తులాల బంగారం స్వాధీనం - సూర్యపేట క్రైమ్ వార్తలు

కరోనా వచ్చిందని... చికిత్స తీసుకునేందుకు ఓ కుటుంబం ఆస్పత్రికి వెళ్లిన విషయం గమనించారు అదే గ్రామానికి చెందిన వ్యక్తులు. వారి ఇంట్లో నగదు అధిక మొత్తంలో దొరుకుతుందని భావించి... దొంగతనానికి వెళ్లారు. కానీ చివరకు పోలీసులకు దొరికారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/22-September-2020/8901589_686_8901589_1600798582323.png
http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/22-September-2020/8901589_686_8901589_1600798582323.png

By

Published : Sep 22, 2020, 11:57 PM IST

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు గ్రామంలో జులై 27న భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కుటుంబానికి కరానా సోకింది. వారంతా చికిత్స నిమిత్తం హైదరాబాద్​కి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన ముగ్గురు స్థానికులు... బాధితుల ఇంట్లోని 62 తులాల బంగారు ఆభరణాలు, లక్ష రూపాయల నగదు చోరీ చేశారు.

ఘటన స్థలాన్ని పరిశీలించిన స్థానిక పోలీసులు... తెలిసినవారే నేరానికి పాల్పడి ఉంటారనే కోణంలో విచారణ ప్రారంభించారు. అనుమానించినట్లుగానే అదే గ్రామానికి చెందిన వ్యక్తులపై చోరీ చేశారు. దర్యాప్తు జరిపి చోరీకి పాల్పడిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి నుంచి నగలు స్వాధీనం చేసుకున్నారు. వీరికి సహకరించిన మరో వ్యక్తిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ భాస్కరన్ అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details