కుటుంబ కలహాలతో.. బాలిక ఆత్మహత్య! - ఇల్లందు వార్తలు
కుటుంబ కలహాల కారణంగా పదహారు సంవత్సరాల బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల పరిధిలో చోటు చేసుకుంది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే మృతి చెందింది.
![కుటుంబ కలహాలతో.. బాలిక ఆత్మహత్య! కుటుంబ కలహాలతో.. బాలిక ఆత్మహత్య!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8480901-646-8480901-1597847264335.jpg)
కుటుంబ కలహాలతో.. బాలిక ఆత్మహత్య!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పోలారం గ్రామ పంచాయితీ పరిధిలోని బొంబాయి తండాకు చెందిన 16 సంవత్సరాల బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన బానోత్ శైలజ ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి పడిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఇల్లందు ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలోనే శ్వాస విడిచింది. బాలిక మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.