తాను ప్రేమించినవాడికి ఇంతకు ముందే పెళ్లైన విషయం తెలుసుకుని చిత్తూరు జిల్లాలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. డిగ్రీ చదువుతున్న యువతి ఇబ్రహీం అనే యువకుణ్ని ప్రేమించింది. తనకు పెళ్లైన విషయం దాచిపెట్టి ఇబ్రహీం ఆమెను మోసం చేశాడు. ఈ విషయం తెలిసిన బాధితురాలు ఈ నెల 13న ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇబ్రహీంను అరెస్టు చేయాలని యువతి బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు త్వరలోనే నిందితుణ్ని పట్టుకుంటామని తెలిపారు.
ప్రేమించిన వాడు మోసం చేశాడని యువతి ఆత్మహత్య - suicide news in chittoor
ప్రేమించినవాడికి ముందే పెళ్లైందని తెలుసుకుని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
![ప్రేమించిన వాడు మోసం చేశాడని యువతి ఆత్మహత్య girl make suicide due to love failure happend in chittoor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5380458-461-5380458-1576407559085.jpg)
ప్రేమించి మోసపోయిన యువతి
ప్రేమలో మోసపోయానని యువతి ఆత్మహత్య