విజయనగరం జిల్లాలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి.. భోగాపురం ఎస్సై మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం నలుగురు యువకులు విశాఖ ఏజెన్సీ నుంచి బిహార్ వైపు రెండు వాహనాల్లో 200 కిలోలున్న రూ.15 లక్షల విలువైన గంజాయిని రవాణా చేస్తున్నారు. దీనిపై ముందస్తు సమాచారం అందడంతో పోలిపల్లి వద్ద తనిఖీలు చేపట్టారు. అందులో ఒక వాహనాన్ని పోలీసులు తనిఖీ చేయగా గంజాయితో పాటు ఇద్దరు దొరికిపోయారు. మరో వాహనం దీని కన్నా ముందు వెళ్లిపోయింది. దాన్ని కూడా పట్టుకుని తనిఖీ చేశారు. ఈ రెండు వాహనాలు పశ్చిమబంగాకు చెందినవిగా గుర్తించారు. వాటిలో ఉన్న సరకును స్వాధీనం చేసుకుని నలుగుర్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
గంజాయి రవాణా చేస్తూ దొరికిన వారంతా.. 20 ఏళ్లలోపు వారే - విజయనగరం జిల్లా న్యూస్ అప్డేట్స్
వారంతా 20 ఏళ్ల లోపు యువకులే. గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు దొరికిపోయి కటకటాల పాలయ్యారు. రూ. 15 లక్షల సరకు స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ganja smuggling