ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

ముగ్గరు దొంగలు అరెస్ట్.. రూ.10 లక్షల చోరీ సొత్తు స్వాధీనం - నెల్లూరు జిల్లా వార్తలు

నెల్లూరు జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి బంగారు, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపారు.

gang of three robbers arrested
three robbers arrested in nellore

By

Published : Jan 13, 2021, 1:35 PM IST

తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 10.40 లక్షల విలువైన చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు నగరం, గ్రామీణ ప్రాంతాల్లో తరచూ దొంగతనాలు జరుగుతుండటంపై పోలీసులు నిఘా పెట్టారు.

కరీముల్లా, జయపాల్, ఖాజావలిని అరెస్ట్ చేశారు. అయిదు ఇళ్లల్లో వీరు చోరీకి పాల్పడ్డారని జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపారు. 204 గ్రాముల బంగారు ఆభరణాలు, 250 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. వీరిని పట్టుకున్న పోలీసులను ఆయన అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details