ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

ఎలక్ట్రానిక్​ వస్తువుల విక్రయం పేరుతో మోసం.. రూ.3.5 కోట్లకు టోకరా - latest frauds at guntur district

గుంటూరు జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఎలక్ట్రానిక్​ వస్తువుల విక్రయం పేరుతో దంపతులు రూ.3.50 కోట్లకు టోకరా వేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గుంటూరు జిల్లాలో ఘరానా మోసం

By

Published : Nov 11, 2019, 6:00 PM IST

గుంటూరు జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. కొరిటిపాడు, నాయుడుపేట, ముత్యాలరెడ్డి నగర్‌లో ఎలక్ట్రానిక్​ వస్తువుల విక్రయం పేరుతో దంపతులు రూ. 3.5 కోట్లకు టోకరా వేశారు. తిరుమలశెట్టి వెంకటేశ్​, మానస దంపతులు ఎలక్ట్రానిక్‌ వస్తువుల విక్రయం పేరుతో వ్యాపారం నిర్వహిస్తామని మోసానికి పాల్పడ్డారు. వీరికి దాదాపు 25 మంది బాధితులు డబ్బులు చెల్లించారు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలంటూ అర్బన్​ ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details