ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

రోడ్డు ప్రమాదాల్లో.. చిన్నారి సహా ముగ్గురు మృతి - రోడ్డు ప్రమాదం

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఓ చిన్నారి ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.

ap accident news
వివిధ రోడ్డు ప్రమాదాల్లో ఓ చిన్నారితో సహా ముగ్గురు మృతి

By

Published : Dec 13, 2020, 8:13 AM IST

విశాఖ నగరంలోని పోర్టురోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ప్రకాశ్ నగర్​కి చెందిన చింతాడ ఆనందరావు ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా ట్రాలర్ ఢీకొట్టింది. ఆనందరావు అక్కడికక్కడే మృతి చెందగా.. వెనక కూర్చున్న రవీంద్ర వర్మకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.

పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లి...

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వంగనూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. తాడిపత్రిలోని నందలపాడు కాలనీకి చెందిన ఖాదర్ భాషా(50) రైల్వే స్టేషన్​లో పల్లీలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. కుమార్తె వివాహం నేపథ్యంలో పెళ్లి పత్రికలు ఇవ్వడం కోసం ద్విచక్రవాహనంపై ముద్దనూరుకు వెళ్తుండగా లారీ ఢీ కొట్టింది. దాంతో ఖాదర్ భాషా అక్కడికక్కడే మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి..

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మూలస్థానం అగ్రహారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల బాలుడు మృతిచెందాడు. తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. కాట్రేనికోన మండలం బుట్ట చెరువుకు చెందిన వరసల మురళీకృష్ణ, అతని ఆరేళ్ల కుమారుడు చైతన్యతో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టారు. బాలుడు తలకు తీవ్ర గాయం కావడం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు. మురళీకృష్ణకు గాయాలు కావడం వల్ల రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రకాశం జిల్లాలో..

ప్రకాశం జిల్లా కనిగిరి వ్యవసాయ మార్కెట్ దగ్గర రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను కనిగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

అప్పుల బాధతో భార్యభర్తల ఆత్మహత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details