కన్న తండ్రే తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లా వింజమూరులో వెలుగులోకి వచ్చింది. వింజమూరు పంచాయతీకి చెందిన ఓ వ్యక్తి తన కుమార్తెను గురువారం ఉదయం బంధువుల ఇంటికి తీసుకెళ్లాడు. అదేరోజు సాయంత్రం ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి తీసుకువస్తూ మద్యం మత్తులో మార్గమధ్యంలో అత్యాచారానికి పాల్పడ్డాడు.
కన్నతండ్రి కాదు కామాంధుడు... కుమార్తెపై అత్యాచారం
కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాటేశాడు. వావి వరసలు మరచి.. కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన నెల్లూరు జిల్లా వింజమూరులో చోటుచేసుకుంది.
కన్నతండ్రి కాదు కామాంధుడు.. కుమార్తెపై అత్యాచారం..
కామాంధుడిలా తండ్రి కాటేస్తుంటే అతడి చెర నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది బాలిక. ఈ విషయాన్ని తల్లికి చెప్పడంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎ.బాజిరెడ్డి తెలిపారు.