ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

దారుణం.. తండ్రే అత్యాచారం చేసి హత్య చేశాడు! - HYD_MDCL_YUVATI_MUDER

కన్న తండ్రే కాలయముడయ్యాడు. కూతురని కూడా చూడకుండా మృగాడిలా రెచ్చిపోయి అత్యాచారం చేసి అనంతరం హత్య చేశాడు. తెలంగాణలోని మేడ్చల్‌ పరిధిలో జరిగిన యువతి హత్య కేసులో నిందితుడు సుబ్రహ్మణ్యంను పోలీసులు అరెస్ట్​ చేశారు. మృతురాలు నిందితుడి మొదటి భార్య కూతురిగా గుర్తించారు.

father_raped_her_daughter_and_murder

By

Published : Jul 22, 2019, 1:17 PM IST

తండ్రే హంతకుడు.. యువతి హత్య కేసులో వీడిన మిస్టరీ

తెలంగాణలోని మేడ్చల్‌లో జరిగిన యువతి హత్య కేసులో మిస్టరీ వీడింది. కన్నతండ్రే అత్యాచారం చేసి చంపినట్లు పోలీసులు గుర్తించారు. బస్తీలోని ఓ ఖాళీ స్థలంలో ఉన్న సంచిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడకు చేరుకొని పరిశీలించగా గుర్తు తెలియని బాలిక గొంతుకోసి ఆనవాళ్లు తెలియకుండా కిరాతకంగా హతమర్చారు. హత్యాస్థలంలో ఆధారాలు లభించకపోవటం వల్ల కేసు దర్యాప్తు కష్టంగా మారింది. దీనిని సవాలుగా తీసుకున్న పోలీసులు డాగ్‌స్వ్కాడ్‌ సాయంతో కేసును ఛేదించారు. తండ్రి సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి ఇద్దరు భార్యలున్నారని, మృతురాలు పెద్ద భార్య కుమార్తెనని పోలీసులు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details