తెలంగాణలోని వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన సయ్యద్ కరీంనగర్ జిల్లా కొత్తగట్టులో నివసిస్తున్నాడు. క్రషర్ వద్ద రాళ్లు కొట్టుకుంటూ జీవనం సాగించేవాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
'చంపుతాడనే భయంతో... తండ్రిని చంపేశాడు' - FATHER MURDER BY SON IN KARIMNAGAR DISTRICT
కన్న తండ్రినే కడతేర్చాడో కొడుకు. మద్యం సేవించి చిత్ర హింసలకు గురిచేయడమే కాకుండా... చంపుతానని బెదిరించిన ఆ తండ్రిని కొడుకే చంపేశాడు. ఈ ఘటన తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

father-murder-by-son-in-karimnagar-district
'చంపుతాడనే భయంతో... తండ్రిని చంపేశాడు'
నిత్యం మద్యం సేవించి భార్య, పిల్లలతో గొడవ పడేవాడు. కొడుకుని చిత్రహింసలు పెడుతూ.. చంపుతానని బెదిరించేవాడు. దీంతో విసిగిపోయిన పెద్దకుమారుడు తండ్రి నిద్రలో ఉన్నప్పుడు బండరాయిని తీసుకొచ్చి తలపై వేయడం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తమను చంపుతాడనే భయంతో పెద్ద కుమారుడు ఈ ఘటనకు పాల్పడినట్లు సీఐ తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.