ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

మద్యం మత్తులో కుమార్తెను కొట్టి చంపిన తండ్రి - మద్యం మత్తులో కూతురుని చంపిన తండ్రి

అతనికి ఉన్న మద్యం అలవాటు... ప్రేమగా పెంచుకుంటున్న కూతురినే కడతేర్చేలా చేసింది. నిత్యం మద్యం సేవించి భార్యతో గొడవపడే అతను... క్షణికావేశంలో తన ఐదేళ్ల కూతురిని నేలకేసి కొట్టగా... ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది.

father-hits-his-daughter
father-hits-his-daughter

By

Published : Dec 5, 2020, 4:36 PM IST

తెలంగాణలోని నిర్మల్ జిల్లా అనంతపేటలో దారుణం చోటుచేసుకుంది. తాగిన మైకంలో ఓ వ్యక్తి కన్న కూతుర్నే కడతేర్చాడు. వినీష్ అనే వ్యక్తి రోజు మద్యం సేవించి...భార్యతో గొడవపడుతుండేవాడు. శుక్రవారం రాత్రి భార్యతో గొడవపడిన వినీష్‌... మద్యం మత్తులో కోపంతో కుమార్తె నిత్యను నేలకేసికొట్టాడు. చిన్నారికి బలమైన గాయమైంది. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంలోనే ప్రాణాలు కోల్పోయింది. నిందితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details