అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలి తండాలో ఆర్థిక ఇబ్బందులతో సురేంద్ర నాయక్ (45) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మొత్తం ఐదుగురు కూతుళ్లకు తండ్రి అయిన సురేంద్ర.. అప్పులు చేసి ఇద్దరికి పెళ్లి చేశాడు.
ఇంకా పెళ్లి కావాల్సిన ముగ్గురు కూతుళ్లు ఉండగా.. ఆర్థిక స్తోమత లేకపోవడం.. ఇంట్లో మనస్పర్థలు పెరగడంతో మనస్తాపానికి గురయ్యాడు. గ్రామ సమీపంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.