ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయిన తండ్రీ కుమారుడు.. తండ్రి గల్లంతు - రాతోని అలుగులో నీటి ఉద్ధృతి వార్తలు

అలుగు ఉద్ధృతి ప్రవాహానికి తండ్రి, కొడుకు గల్లంతు కాగా.. కుమారుడు మాత్రం ప్రాణాలతో బయటపడిన ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లా పెనుబల్లి రాతోని చెరువు వద్ద జరిగింది. తండ్రి ఆచూకీ కోసం మంగళవారం ఉదయం నుంచి గాలిస్తున్నా... ఇప్పటికీ దొరకపోవడం వల్ల కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు.

నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయిన కుమారుడు క్షేమం.. తండ్రి గల్లంతు
నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయిన కుమారుడు క్షేమం.. తండ్రి గల్లంతు

By

Published : Oct 13, 2020, 10:22 PM IST

ఖమ్మం జిల్లా పెనుబల్లికి చెందిన రవి, జగదీశ్​.. తండ్రి కొడుకులు. సోమవారం రాత్రి వాన కురవగా.. తమ పొలాన్ని చూసేందుకు వీరిద్దరు రాతోని చెరువు అలుగు మీదుగా వెళ్తున్నప్పుడు అలుగు సుమారు.. ఆరు అంగుళాల మేర ప్రవహిస్తోంది. వారు పొలం నుంచి తిరిగి వచ్చే సమయానికి ఉద్ధృతి పెరిగి తండ్రి జారి వాగులోకి పడిపోబోయాడు. ఈ క్రమంలో కొడుకు కాలు పట్టుకోగా.. ఇద్దరూ వాగు ప్రవాహంలో కొట్టుకుపోయారు.

కొంత దూరం వెళ్లాక కుమారునికి చెట్టు ఆసరా దొరికి దాన్ని పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. రవి ఆచూకీ కోసం సత్తుపల్లి ఫైర్​స్టేషన్​ సిబ్బంది, స్థానిక యువకులు గాలించినా లాభం లేకపోయింది. జాడతెలీక రవి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండిఃవాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు

ABOUT THE AUTHOR

...view details