అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం దాదులూరు కొట్టాలకు చెందిన రైతు చంద్రయ్యడు(47) అప్పుల బాధతో చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు. పంట పెట్టుబడులకు, కుటుంబ పోషణకు రూ. 10 లక్షల వరకు అప్పు చేశాడు. నాలుగు ఎకరాల్లో సాగు చేసిన వేరుశెనగ పంట ఇటీవలే తొలగించాడు. పంట చేతికందే సమయంలో వర్షాలు రావడంతో తొలగించిన వేరుశెనగ కాయలు వర్షానికి మొలకెత్తాయి. చిల్లి గవ్వ కూడా చేతికందే పరిస్థితి లేకపోవడంతో అప్పుల వాళ్లకు ఎలా చెల్లించాలనే మనస్తాపంతో పొలం వద్దే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య - ananthapuram latest news
అప్పుల బాధతో రైతు బలవన్మరణం చెందిన ఘటన అనంతపురం జిల్లా కనగానపల్లి మండలంలో జరిగింది. దాదాపు రూ. 10 లక్షల అప్పు ఎలా తీర్చాలనే బెంగతో ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
చంద్రయ్యకి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ పెద్ద ఆత్మహత్య చేసుకోవడంతో భార్య పిల్లలు బోరున విలపించారు. కనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి:జింకల వేటగాళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు
Last Updated : Sep 18, 2020, 12:16 PM IST