ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

మంత్రాల నెపం.. దుండగుల చేతిలో రైతు హతం? - kumuram bheem district news

తెలంగాణలోని కుమురం భీం జిల్లా తిర్యాణి మండలం తాటిమాదర గ్రామానికి చెందిన రైతు ఆత్రం లచ్చును.. గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. మంత్రాల నెపంతోనే ఘటన జరిగినట్లు సమాచారం.

farmer killed at kumuram bheem
మంత్రాల నెపంతో రైతు దారుణహత్య..

By

Published : Nov 24, 2020, 11:46 AM IST

మంత్రాల నెపంతో ఓ వ్యక్తిని కిరాతకంగా హతమార్చారు. తెలంగాణలోని కుమురం భీం జిల్లా తిర్యాణి మండలంలో ఈ ఘటన జరిగింది. భీంజీగూడ పంచాయతీ తాటిమాదర గ్రామానికి చెందిన రైతు ఆత్రం లచ్చుకు పుర్కగూడ సమీపంలో 6 ఎకరాల పొలం ఉంది. ఆదివారం రాత్రి కాపలా కోసం పొలం వద్దకు వెళ్లిన ఆయన సోమవారం ఉదయం వరకూ ఇంటికి రాలేదు. పొలం వద్దనే రక్తపుమడుగులో మృతి చెంది ఉండగా స్థానిక రైతులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

అదే గ్రామానికి చెందిన ఆత్రం అర్జు.. ఇరవై రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. లచ్చు కుటుంబం మంత్రాలు వేయడం వల్లనే ఆయన మృతి చెందినట్లు వారు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై ఇరు కుటుంబాలు ఇటీవల గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో అర్జు బంధువులే తన భర్తను హత్య చేశారని లచ్చు భార్య మైనుబాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details