ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

పోలీసుల పేరుతో వసూళ్లు..ఐదుగురు అరెస్ట్ - latest crime news in vijayawada city

పోలీసులమంటూ వసూళ్లకు పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తులు విజయవాడల అరెస్ట్ అయ్యారు. గంజాయికి బానిసైన వ్యక్తిని బెదిరించి...3 లక్షల రూపాయలను డిమాండ్ చేసిన వీరిని టాస్క్​ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వీరిలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

fake police gang arrested
fake police gang arrested

By

Published : Oct 30, 2020, 4:39 PM IST

పోలీసుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తులను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయికి బానిసైన ఓ వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని ఐదుగురు వ్యక్తులు పోలీసులమని బెదిరించారు. మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ నగదు తీసుకునేందుకు బందరు రోడ్​లోని ఓ బ్యాంక్ ఏటీఎం వద్దకు వచ్చారు. ఈ క్రమంలో టాస్క్ ఫోర్స్ పోలీసులను నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు.

ఐదుగురు నిందితుల్లో ముగ్గురు చిట్టినగర్​కు చెందిన యువకులున్నారని పోలీసులు గుర్తించారు. వారిలో ఇంజినీరింగ్ చదువుతున్న వాళ్లు ఉన్నట్లు విచారణలో తేలినట్లు సమాచారం. బాధితుడు గంజాయి సేవిస్తూ...గంజాయి విక్రయాలు జరుపుతాడని ..దీన్ని ఆసరాగా చేసుకుని పోలీసుల పేరుతో నగదు డిమాండ్ చేసినట్లు విచారణలో తేలింది. నిందితుల్లో ఏఆర్ ఎస్సై కుమారుడు ఉన్నట్లు పోలీసులు నిర్ధరించారు. దీనిపై సూర్యారావుపేట పోలీసుస్టేషన్​లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details