ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

విజయవాడలో ఘాతుకం.. యువతిని చంపిన ప్రేమోన్మాది

విజయవాడలో సంచలనం సృష్టించిన యువతి హత్య ఉదంతంలో ఇంకా మిస్టరీ వీడలేదు. యువతిని విచక్షణారహితంగా పొడిచి చంపి.. తానూ గాయపరచుకున్న నిందితుడి ఆరోగ్యం కూడా క్షీణించడంతో అసలేం జరిగిందన్నది అంతుబట్టకుండా ఉంది. విజయవాడలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.

engineering-student-brutally-murdered
engineering-student-brutally-murdered

By

Published : Oct 16, 2020, 3:23 AM IST

విజయవాడకు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థిని నాగేంద్రబాబు అనే యువకుడి చేతిలో బలైంది. పెయింటర్‌ మేస్త్రీగా పనిచేస్తున్న నాగేంద్రబాబు ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో లోపలికి చొరబడ్డాడు. సెకన్ల వ్యవధిలోనే ఆమె మెడపైన, మణికట్టుపైన కత్తితో కోసి తీవ్రంగా గాయపరిచాడు. తానూ అదే కత్తితో పొడుచుకున్నాడు. బయట నుంచి అప్పుడే వచ్చిన విద్యార్థిని తల్లి.... తలుపులు కొడుతున్నా తీయకపోవడంతో అనుమానం వచ్చి పెద్దగా కేకలు వేసింది.

ఇరుగుపొరుగు వారి సాయంతో తలుపులు తీసి చూడటంతో... రక్తపు మడుగులో పడి ఉన్న తన కూమార్తెను చూసి కన్నీరుమున్నీరయ్యింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే యువతి ప్రాణాలు గాల్లో కలిశాయి. అక్కడే రక్తపుమడుగులో ఉన్న యువకుడిని గుంటూరులోని ఆస్పత్రికి తరలించారు.ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతుర్ని కిరాతకంగా చంపేయడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. 20 సంవత్సారాలకే తన కుమార్తె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందంటూ విద్యార్థిని తల్లి కన్నీరుమున్నీరయ్యింది.

ఇద్దరి మధ్య వాగ్వాదం...?

యువతి ఇంట్లోకి నాగేంద్రబాబు వెళ్లిన తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గదిలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఓ బెడ్‌షీట్‌ వేలాడుతూ ఉండటాన్ని బట్టి ఆత్మహత్య చేసుకుంటానని ఇద్దరిలో ఒకరు మరొకర్ని బెదిరించారా....? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. తీవ్రంగా గాయపడిన నాగేంద్రబాబు ప్రస్తుతం మాట్లడలేని పరిస్థితిలో ఉన్నాడని... అతను కోలుకుంటే కొంత స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు.

నాగేంద్రబాబు ఎవరో తెలియదు: తల్లిదండ్రులు

ప్రేమను నిరాకరించినందుకే యువతిని నాగేంద్రబాబు చంపాడని తొలుత ప్రచారం సాగింది. వారిద్దరూ కలిసి ఉన్న చిత్రాలు సాయంత్రానికల్లా సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. నాగేంద్రబాబు స్నేహితుల్ని, స్థానికులను పోలీసులు విచారించగా వారిద్దరికీ వివాహమైందని చెప్పినట్లు సమాచారం. వివాహం విషయాన్ని యువతి తల్లిదండ్రులు ఖండించారు. నాగేంద్రబాబు ఎవరో తమకు, తమకు కుమార్తెకు తెలియదని వాపోయారు. అవి నకిలీ చిత్రాలు అయ్యుంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు ఇటీవల తన ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలను తొలగించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 449,302, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్ల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. యువతి తల్లిదండ్రలను రాష్ట్ర మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ పరామర్శించారు.

ఇదీ చదవండి

ప్రేమంటూ తిరిగాడు... ఒప్పుకోలేదని చంపేశాడు...

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details