ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

అగ్రిగోల్డ్ నిందితులను కస్టడీలోకి తీసుకున్న ఈడీ - అగ్రిగోల్డ్ నిందితులను కస్టడీలోకి తీసుకున్న ఈడీ

enforcment-directorate
enforcment-directorate

By

Published : Dec 28, 2020, 12:20 PM IST

Updated : Dec 28, 2020, 1:28 PM IST

12:20 December 28

అగ్రిగోల్డ్ నిందితులను కస్టడీలోకి తీసుకున్న ఈడీ

అగ్రిగోల్డ్ నిందితులను ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ కస్టడీలోకి తీసుకుంది. అగ్రిగోల్డ్ ఛైర్మన్ అవ్వా వెంకట రామారావు, ప్రమోటర్లు అవ్వా వెంకట శేషు నారాయణరావు, హేమసుందర ప్రసాద్​లను కస్టడీకి తీసుకున్న దర్యాప్తు అధికారులు.. వారిని చంచల్​గూడ జైలు నుంచి ఈడీ కార్యాలయానికి తరలించారు. డిపాజిట్ల పేరుతో వసూలు చేసిన సొమ్ముతో కూడబెట్టుకున్న మరిన్ని ఆస్తులు, విదేశాలకు తరలించిన సొమ్ము వివరాలపై అగ్రిగోల్డ్ ప్రమోటర్లను అధికారులు ప్రశ్నించనున్నారు.

డిపాజిట్ల పేరుతో 8 రాష్ట్రాలకు చెందిన 32 లక్షల మందిని మోసం చేసి.. రూ.6,380 కోట్లు వసూలు చేసినట్లు ఇప్పటికే ఈడీ వెల్లడించింది. అగ్రిగోల్డ్ యాజమాన్యానికి చెందిన రూ.4,109 కోట్ల విలువైన ఆస్తులను ఈనెల 24న ఈడీ అటాచ్ చేసింది. విదేశాలకు సైతం నిధులను తరలించినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు ఈడీ పేర్కొంది. ఈనెల 22న రామారావు, శేషు నారాయణరావు, హేమసుందర ప్రసాద్​లను అరెస్టు చేసి చంచల్​గూడ జైలుకు పంపించిన ఈడీ.. ముగ్గురినీ జనవరి 5 వరకు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించేందుకు న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకుంది.

ఇదీ చదవండి:అయోధ్య రామాలయం పేరిట అక్రమ వసూళ్లు

Last Updated : Dec 28, 2020, 1:28 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details