కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో దొంగలు చేసిన చోరీలో పోలీసులు వాటా తీసుకుంటున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల దొంగతనం కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే కొత్తగా వచ్చిన శిక్షణ ఐపీఎస్ ప్రతాప్ శివకిషోర్.... దొంగలకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో తెలుసుకునేందుకు... వారి ఫోన్ డేటాను తనిఖీ చేశారు. అందులో విస్తుపోయే అంశాలు బయటపడినట్లు తెలుస్తోంది. దొంగలు చోరీలకు పాల్పడి... దోచుకున్న సొమ్ములో పోలీసులు వాటా తీసుకుంటున్నట్లు విచారణలో తేలింది. ఫలితంగా ఒక ఎఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డును అదుపులోకి తీసుకున్నారు.
దోచేస్తున్నారు..పోలీసులతో కలసి పంచుకుంటున్నారు...!
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని కొందరు పోలీసులు సరికొత్త అవతారమెత్తారు. డబ్బుల కోసం దొంగలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. చోరీలకు పాల్పడి దోచుకున్న సొమ్ములో వాటాలు తీసుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. ఈ అవినీతి తతంగం ఉన్నతాధికారుల విచారణలో బయటపడటంతో జిల్లాలో చర్చనీయాంశమైంది.
emmiganur