ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

ఇద్దరు మృతి: రక్షణ కోసం కంచె కడితే భక్షించింది - Electric fence turned into a curse in Dupalli

నారుమడికి పందుల నుంచి రక్షణగా కట్టిన విద్యుత్ కంచె తగిలి ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా దూపల్లిలో చోటుచేసుకుంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

electric-fence
electric-fence

By

Published : Dec 7, 2020, 6:57 PM IST

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం దూపల్లి గ్రామ శివారులో విషాదం చోటుచేసుకుంది. నారుమడికి పందుల నుంచి రక్షణగా కట్టిన విద్యుత్ కంచె ఇద్దరి పాలిట శాపంగా మారింది. పందులను వేటాడడానికి వెళ్లిన ఇద్దరు కంచె తగిలి అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

ఉదయం పంట పొలాలకు వెళ్లిన గ్రామస్థులు ఇద్దరు అక్కడ శవాలుగా పడి ఉండడం చూసి పోలీసులకు సమాచారం అందించారు. వారి వివరాలు ఎవరికైనా తెలిస్తే తమకు సమాచారం అందించాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details