అగ్రిగోల్డ్ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ...ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తోంది. అగ్రిగోల్డ్ కార్యాలయాలు, డైరెక్టర్ల ఇళ్లతో పాటు... పలువురి నివాసాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. సీఐడీ కేసుల ఆధారంగా ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం... ఈసీఐఆర్ నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు సుమారు 6వేల 7వందల కోట్ల రూపాయలు కాజేశారని అగ్రిగోల్డ్ యాజమాన్యంపై అభియోగ పత్రం దాఖలైంది.
అగ్రిగోల్డ్ కుంభకోణంపై కేసు నమోదు చేసిన ఈడీ - అగ్రిగోల్డ్ కుంభకోణం వార్తలు
అగ్రిగోల్డ్ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరిపింది. సీఐడీ కేసుల ఆధారంగా ఈడీ.. ఈసీఐఆర్ నమోదు చేసింది.
![అగ్రిగోల్డ్ కుంభకోణంపై కేసు నమోదు చేసిన ఈడీ Ed_Raids_On_Agrigold](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6291528-820-6291528-1583315532967.jpg)
Ed_Raids_On_Agrigold