తహసీల్దార్ విజయారెడ్డి డ్రైవర్ గురునాథం మృతి - విజయారెడ్డి హత్య కేసులో డ్రైవర్ గురునాథం మృతి
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో మరొకరు ప్రాణాలొదిలారు. తహసీల్దార్ డ్రైవర్ గురునాథం ఇవాళ హైదరాబాద్ లోని డీఆర్‌డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 80 శాతం కాలిన గాయాలతో నిన్న గురునాథం ఆస్పత్రిలో చేరారు. అటెండర్ చంద్రయ్య చికిత్స పొందుతున్నారు.
driver gurunatham