ఫోన్ చేసి ఆమ్లేట్ కావాలన్నాడు... వెళ్తే కోరిక తీర్చమని వేధించాడు ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా... ఆడవారిపై వేధింపులు ఆగడంలేదు. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. నలుగురికి సేవ చేసే వైద్య వృత్తిలో ఉన్న వైద్యుడే... తన దగ్గర పనిచేసే సిబ్బందిని వేధింపులకు గురిచేశాడు. స్టాఫ్‌నర్సు పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వాసుపత్రిలో వెలుగు చూసింది.
అసలేం జరిగిందంటే...?
బాధితురాలి వివరాల ప్రకారం... నెల్లూరు జిల్లా ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో డ్రాయింగ్ అధికారి డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్... విధులు ముగించుకొని ఇంటికి వెళ్లిన స్టాఫ్‌నర్సుకు ఫోన్ చేశాడు. ఆమ్లేట్ వేసి వైద్యశాలకు తీసుకురావాలని కోరాడు. ఆస్పత్రిలో పనిచేసే అటెండర్‌కు చెప్పొచ్చు కదా అని నర్సు బదులిచ్చింది. లేదు నువ్వే తీసుకురావాలని చెప్పాడు డాక్టర్. ఆయన చెప్పినట్లే ఆమ్లేట్ వేసుకొని వైద్యశాలకు వచ్చిన స్టాఫ్‌నర్స్ డాక్టర్ గదిలోకి వెళ్లింది.
నువ్వంటే ఇష్టమని, తన కోరిక తీర్చాలంటూ డాక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. నిరాకరించిన నర్సు అక్కడి నుంచి తప్పించుకొని ఇంటికి వెళ్లిపోయింది. జరిగిన విషయాన్ని భర్తతో పాటు ఆమె సోదరుడికి ఫోన్ చేసి వివరించింది. ఆస్పత్రికి వచ్చిన కుటుంబసభ్యులు డాక్టర్‌పై దాడి చేశారు. దేహాశుద్ధి చేసి... అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ తమను కూడా లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురి చేశాడంటూ పలువురు నర్సులు వాపోయారు.
ఇదీ చదవండి : దినదినగండం.. మృత్యువుతో పోరాటం