దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార ఘటనలో తెలంగాణ పోలీసుల పరిశోధన కీలకదశలో ఉంది. నిందితులు... మహ్మద్ పాషా, జొల్లు శివ, చెన్నకేశవులు, నవీన్ కుమార్‌లకు వ్యతిరేకంగా ఈ కేసులో శంషాబాద్, షాద్‌నగర్ పోలీసులు సుమారు 40 సాక్ష్యాధారాలను ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పరీక్షల నిమిత్తం పంపించారు. ఇందులో కీలకమైన సాక్ష్యాలు దిశ, ఆమె సోదరి స్వరం, తొండుపల్లి టోల్‌గేట్ వద్ద బాధితురాలని లాక్కెళ్లేటప్పుడు చిత్రీకరించిన సీసీ పుటేజీ, దిశ చరవాణిలోని నంబర్లు... సంక్షిప్త సందేశాలు.. ఫోన్ సంభాషణల నివేదికలను ప్రత్యేకంగా రూపొందించారు.
కీలకమైన సీసీకెమెరా దృశ్యాలు...
దిశ హత్యాచారానికి సంబంధించి తెలంగాణలోని తొండుపల్లి టోల్‌గేట్ కూడలి వద్ద ఉన్న సీసీ కెమెరాలో అత్యంత కీలకమైన చిత్రాలు నిక్షిప్తమయ్యాయి. పోలీసులు సమర్పించిన ఆ సీసీ కెమెరా పుటేజీని ఫోరెన్సిక్ ప్రయోగశాల అధికారులు సాంకేతిక పరిజ్ఞానంతో విశ్లేషించారు. నిందితుల ముఖాలు, పోలికలు కనిపించేలా సాంకేతికంగా అభివృద్ధి చేశారు.
సంభాషణల పరిశీలన...