ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

తిరుపతి: బంగారు కిరీటాల చోరీ కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష - తిరుమల బంగారు కిరీటాల చోరీ కేసు విచారణ వార్తలు

తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో బంగారు కిరీటాల చోరీ కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష పడింది. ఇద్దరు వ్యక్తులు గతేడాది ఫిబ్రవరి 2న తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలో బంగారు కిరీటాలను చోరీ చేశారు. ఈ కేసులో ఒక నిందితుడికి ఏడాది జైలుశిక్ష విధించిన తిరుపతి రెండో అదనపు మున్సిఫ్ కోర్టు.. మరో నిందితుడు విచారణకు రాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

tirupati chori
tirupati chori

By

Published : Dec 15, 2020, 9:43 AM IST

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలో బంగారు కిరీటాల చోరీ కేసులో నిందితుడికి తిరుపతి కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. గత ఏడాది ఫిబ్రవరి 2న గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలో కళ్యాణ వేంకటేశ్వర స్వామి విగ్రహలకు ఉన్న మూడు బంగారు కిరీటాలను ఇద్దరు నిందితులు చోరీ చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా... వారిలో ఓ నిందితుడు ఆకాష్ ప్రతాప్ సరోడి నేరం అంగీకరించడంతో తిరుపతి రెండవ మున్సిఫ్ కోర్టు ఏడాది జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. మరో నిందితుడు షేక్ నహీం బెయిల్ పై విడుదలై విచారణకు హాజరుకాకపోవడంతో అతనికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details