తండ్రి అఘాయిత్యం.. కుమార్తె ఆత్మహత్యాయత్నం - తండ్రి అఘాయిత్యం.. కుమార్తె ఆత్మహత్యాయత్నం
16:31 June 09
తండ్రి అఘాయిత్యం.. కుమార్తె ఆత్మహత్యాయత్నం
గుంటూరు జిల్లా పెదనందిపాడులో దారుణం జరిగింది. కన్న కూతురి పైనే తండ్రి అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఓ వ్యక్తి.. తన కన్న కుమార్తెపై ఆదివారం మధ్యాహ్నం అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఆ విషయం బయటకు చెప్పలేక.. ఆవేదన భరించలేక.. ఎలుకల మందును శీతలపానియంలో కలిపి తాగిన బాధితురాలు.. ఆత్మహత్యాయత్నం చేసింది.
విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు బాధితురాలిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సమాచారం అందుకున్న బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని... అతని కోసం గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు.