మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గోపాలపురం కాలనీలోని ఓ ఇంట్లో మహిళ వంట చేస్తుండగా గ్యాస్ లీక్ అయి సిలిండర్ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న బ్లూకోట్స్ పోలీసు సిబ్బంది అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని గ్యాస్ సిలిండర్ నుంచి వస్తున్న మంటలను ఆర్పివేశారు.
గ్యాస్ లీక్‌తో మంటలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం - gas cylinder leak in mahabubabad news
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గ్యాస్ సిలిండర్ లీక్ కలకలం సృష్టించింది. గ్యాస్ సిలిండర్ లీక్ అవటం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు.
గ్యాస్ లీక్‌తో మంటలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
ఈ సంఘటనతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న వారికి అగ్నిమాపక సిబ్బంది కౌన్సిలింగ్ నిర్వహించారు. సిలిండర్ కన్నా గ్యాస్ పొయ్యి ఎత్తులో ఉంచి వంట చేయాలని సూచించారు. వంట అయిపోయిన తర్వాత తప్పనిసరిగా రెగ్యులేటర్ వద్ద గ్యాస్‌ను ఆఫ్ చేయాలని తెలిపారు.
ఇదీ చదవండి:పూరింటిపైకి దూసుకువెళ్లిన ట్యాంకర్