ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

జవాన్ల అవతారమెత్తి..మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్​

తెలంగాణలో ఆర్మీ అధికారులుగా చలామణి అవుతున్న ముఠాను సైబరాబాద్​ ఎస్​వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఆర్మీ యూనిఫాం, నకిలీ తుపాకులు, ఐడీ కార్డు, స్వాధీనం చేసుకున్నట్టు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.

fake amy officers arrest at cyberabad
జవాన్ల అవతారమెత్తిన దొంగలు

By

Published : Sep 30, 2020, 9:59 AM IST

ఆర్మీ అధికారులుగా చెప్పుకుని మోసాలకు పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నట్టు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. కిడ్నాప్‌ సహా పలు నేరాలకు పాల్పడిన రఘువర్మ అనే వ్యక్తిని అరెస్టు చేసి, నకిలీ ఐడీ కార్డులు, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా కోడూరు మండలం కొమ్ముచిక్కాలకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అనేక మారు పేర్లతో చలామణి అవుతున్న ఇతను... డ్రైవర్​, ఎలక్ట్రిషన్​గా పనిచేసేవాడని సీపీ వెల్లడించారు.

జవాన్ల అవతారమెత్తిన దొంగలు

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన విద్యార్థి కాలేపల్లి రాజేష్​, విజయనగరం జిల్లా పార్వతీపురం గ్రామానికి చెందిన కావేటి రామకృష్ణ, కామారెడ్డి జిల్లా గాంధారి మండలం నేవెల్ తాండాకు చెందిన జోరేసింగ్​తో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరు కిడ్నాప్ చేసినట్టు ఆర్సీపురం పీఎస్​లో కేసు నమోదైంది. వీరంతా నకిలీ ఆర్మీ ఐటీ కార్డు, యూనిఫాం కొనుక్కొని సైనికులుగా చలామణి అవుతున్నారు. పరమవీర చక్ర, భారతరత్న తప్ప మిగతా అన్ని సైనిక పురస్కారాలు కొనుకున్నట్టు సీపీ తెలిపారు. ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసి రూ.6.80లక్షలు వసూలు చేసినట్టు వెల్లడించారు.

సైబరాబాద్ సీపీ సజ్జనార్

ఇదీ చూడండి:'రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది'

ABOUT THE AUTHOR

...view details