ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

ప్రజల భయాన్ని సొమ్ము చేసుకుంటున్నారు - corona latest news

కరోనా భయం కేటుగాళ్లకు కాసులు కురిపిస్తోంది. ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకునేందుకు మోసగాళ్లు రెడీ అయ్యారు. కరోనా ధాటికి మాస్కులకు డిమాండ్‌ పెరిగింది. మాస్కుల కొరతను అవకాశంగా చేసుకొని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.

cyber-gang-cheated-a-doctor-in-hyderabad
cyber-gang-cheated-a-doctor-in-hyderabad

By

Published : Mar 17, 2020, 12:13 PM IST

కరోనా భయంలో ప్రజలు ఉంటే.. దాన్ని సొమ్ము చేసుకునేందుకు సైబర్ నేరగాళ్లు సిద్ధమయ్యారు. మాస్కుల కొరతను అవకాశంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వైద్యుడు.. ఆన్‌లైన్‌లో మాస్కుల కోసం సెర్చ్ చేసి, 50 పెట్టెలను ఆర్డర్ చేశాడు.

మెటీరియల్ పంపిస్తున్నామని షిప్పింగ్ పూర్తయిందని నమ్మించి.. మొత్తం రూ.4,11,000 దండుకున్నారు. మెటీరియల్ రాకపోయే సరికి మోసపోయానని తెలుసుకున్న బాధిత డాక్టర్.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:వ్యక్తిగత శుభ్రతతోనే.. కరోనాను నిరోధించొచ్చు

ABOUT THE AUTHOR

...view details