సైబర్ కేటుగాళ్లకు.... ప్రజల అవసరాలే అవకాశాలు. ఏమాత్రం ఆసరా దొరికినా.. నయా దందాలతో నిలువునా దోచేస్తారు. ఇలాంటి సైబర్ దోపిడీకి బాధితురాలైంది విజయవాడకు చెందిన ఊర్వశి అనే యువతి. హైదరాబాద్‌లో ఉంటున్న ఈమె.... ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు కిడ్నీ విక్రయించాలనుంది. ఉద్యోగం కోసం ఆన్‌లైన్‌లో వెతుకున్న సమయంలో... కిడ్నీ దానం చేస్తే 25 లక్షలు ఇస్తామన్న ప్రకటన కనపడింది. ఫోన్‌లో సంప్రదిస్తే.... ది నేషనల్ కిడ్నీ ఫౌండేషన్‌లో పేరు నమోదు చేసుకునేందుకు 10 వేల రూపాయలు చెల్లించాలని యువతికి తెలిపారు. మోసం అని గ్రహించలేకపోయిన ఆమె... డబ్బు జమ చేసింది. ఇలా రకరకాల ఫీజుల పేరుతో నిందితుడు విడతల వారీగా లక్షా 20 వేల రూపాయలు దోచేశాడు.
అనుమానంతో ఫిర్యాదు...