ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

గిఫ్ట్ వచ్చిందన్నారు.. 16లక్షలు కాజేశారు

గిఫ్ట్ వచ్చిందని ఓ మహిళకు ఫోన్ చేశారు సైబర్ కేటుగాళ్లు. టాక్స్ కడితే దానిని ఆమె ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. అలా మాయ మాటలు చెప్పి రూ.16లక్షలు తమ ఖాతాలో వేయించుకున్నారు. చివరకి తాను మోసపోయానని గ్రహించిన బాధిత మహిళ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. ఇదే తరహాలో మరో ముగ్గురు వ్యక్తులూ సైబర్ మోసగాళ్ల వలలో చిక్కారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

cyber-crime
cyber-cricyber-crimeme

By

Published : Oct 2, 2020, 3:33 PM IST

మహిళకు గిఫ్ట్ వచ్చిందని ఫోన్ చేశారు. వాటిని ఆమె ఖాతాలో జమ చేయాలి అంటే టాక్స్ చెల్లించాలని నమ్మబలికారు. జీఎస్టీ, ఇన్కం టాక్స్, సేల్స్ టాక్స్, కస్టమ్స్ టాక్స్ పేర్లతో ఆన్ లైన్ ద్వారా రూ.16 లక్షలు తమ ఖాతాలో వేయించుకున్నారు సైబర్ మోసగాళ్ళు. చివరకు తాను మోసపోయానని గ్రహించిన రాం నగర్ కు చెందిన బాధిత మహిళ.. వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

మరో ముగ్గురు

కేవైసీ, ఉద్యోగం, లాటరీ, లోన్ పేర్లతో మరో ముగ్గురికి మోసగాళ్లు టోపీ పెట్టారు. రూ.18 లక్షలు ఆన్ లైన్​లో డ్రా చేసుకున్నారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి:గిరిజనులకు భూపట్టాల పంపిణీ.. హామీ నిలబెట్టుకున్నామన్న సీఎం

ABOUT THE AUTHOR

...view details