హైదరాబాద్ గోల్కొండకు చెందిన తాహేర్ అలీఖాన్ బుల్లెట్ కొనుక్కోవాలనుకున్నాడు. అందు కోసం ఓఎల్‌ఎక్స్‌ను ఆశ్రయించగా... అందులో అతినికి ఓ వాహనం నచ్చింది. వెంటనే ఆ వాహన యజమానిని సంప్రదిస్తే తాను మిలిటరీ అధికారినని... ప్రస్తుతం తనకు గుజరాత్‌కు బదిలీ అయిందని తెలిపాడు. అందుకే తన వాహనాన్ని అమ్ముతున్నట్లు వివరించాడు. అది నిజమేనని నమ్మిన అలీఖాన్... ఆ వాహనాన్ని బేరమాడారు.
రోజురోజుకూ పెరిగిపోతున్న ఓఎల్ఎక్స్ మోసాలు - ONLINE FRAUD
ఓఎల్ఎక్స్ మోసాల గురించి పోలీసులు ఎంతగా చెప్తున్న కొందరు వ్యక్తులు మాత్రం వాటిని పట్టించుకోకుండా తక్కువ ధరకే వస్తువులొస్తున్నాయంటూ సైబర్ నేరగాళ్ల ఖాతాలో డబ్బులు కుమ్మరిస్తున్నాడు. చివరకు మోసాన్ని గ్రహించి పోలీసుల చెంతకు చేరుతున్నారు.
అలీఖాన్ అడిగిన ధరకే వాహనాన్ని ఇస్తానన్న నకిలీ మిలిటరీ అధికారి ముందుగానే కనీసం 50 శాతం డబ్బును తన ఖాతాలోకి బదిలీ చేయాలని తెలిపాడు. తక్కువ ధరలో వాహనం తనదవుతుందనుకున్న అలీఖాన్ వెంటనే డబ్బులను అతడి ఖాతాలోకి పంపాడు. ఆ తర్వాత నీ వాహనం తీసుకొస్తున్నానని చెప్పి చెక్ పోస్టు దగ్గర... జీఎస్టీ పేర్లతో మొత్తం లక్షా 20 వేల రూపాయలను తన ఖాతాలో వేయించుకున్నాడు సైబర్ దొంగ. ఆ తర్వాత ఆ నేరగాడు ఫోన్ స్విచ్చాఫ్ చేసేశాడు. చివరకు మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీ చూడండి:చీరపై కరోనా వారియర్స్ పోరాట చిత్రాలు