విదేశాల నుంచి కానుకల పేరిట సైబర్ నేరస్థులు రూ. 20 లక్షలు దోపిడీకి పాల్పడిన సంఘటన తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి కానుకల పేరిట 70 వేల పౌండ్ల నగదు వచ్చిందని సైబర్ నేరగాళ్లు సందేశం పంపించారు. భారతీయ కరెన్సీగా మార్చేందుకు టాక్స్‌ల పేరిట బాధితుడి నుంచి వివిద దశల్లో మొత్తం రూ. 20 లక్షల 80 వేలు వసూలు చేశారు.
నగదు జమ చేసినా వారు చెప్పిన బహుమతి సొమ్ము ఖాతాలో జమ కాలేదు. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.