సైబర్ దొంగలు కొత్త ఆలోచనలతో అమాయక ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. హైదరాబాద్ మలక్‌పేట్ ఆనందనగర్‌కు చెందిన కృష్ణజా ఉద్యోగ వేటలో ఉన్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం కృష్ణజాకు ఫోన్ వచ్చింది. జూబ్లీహిల్స్‌లోని కలర్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలో టీమ్ లీడర్ ఉద్యోగం ఖాళీగా ఉందని... మీరు కోరితే ఆ అవకాశం మీకే ఇస్తానంటూ చెప్పాడు గుర్తు తెలియన వ్యక్తి. కృష్ణజా సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.
తస్మాత్ జాగ్రత్త: ఉద్యోగం ఇస్తానని రూ.79 వేలు దోచేశారు.!
సైబర్ క్రైమ్‌పై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా... బాధితులు పెరిగిపోతూనే ఉన్నారు. ఉద్యోగం ఇస్తానంటూ ఒకరిని సైబర్ దొంగలు నిలువు దోపిడీ చేశారు. ఉద్యోగం ఇవ్వాలంటే డబ్బులు కట్టాలని రూ.79వేలు ఖాతాలో వేయించుకున్నారు. అనంతరం స్పందించకపోవడం వల్ల బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
cyber-cheaters-employment-cheating-in-hyderabad
ఉద్యోగం ఇవ్వాలంటే రిజిస్ట్రేషన్ కోసం ఇన్సూరెన్స్, సెక్యూరిటీ డిపాజిట్ ఇలా వివిధ కారణాల పేరుతో 79వేలు ఖాతాలో వేయించుకున్నాడు. ఆ తర్వాత స్పందించడం మానేశాడు. దీంతో బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: 'అత్యాశే శాపం.. పెరుగుతున్న ఆన్లైన్ గేమింగ్ మోసం'