ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

"పూటుగా తాగాం... ఆ యువతి కనిపించగానే ఏదో ఒకటి చేయాలనుకున్నాం..." - Culprits of disha case Interogation 1st day at charlapally jail

'ఏమో సార్‌...అప్పుడు మేము పుల్లుగా తాగి ఉన్నాం. ఏం చేస్తున్నామో అర్థంకాలేదు. పొద్దున్న నుంచి ఖాళీగా లారీలో కూర్చోని విసుగు పుట్టింది. ఒంటరిగా యువతి కనిపించగానే ఏదో ఒకటి చేయాలని అనుకున్నాం.' అని యువ వైద్యురాలు దిశ హత్యోదంతంలో నలుగురు నిందుతులు విచారణలో వెల్లడించారు.

culprits-of-disha-case
culprits-of-disha-case

By

Published : Dec 2, 2019, 8:07 AM IST

సంచలనం రేపిన దిశ హత్యాచారం కేసులో నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించిన విషయాలు చూసి పోలీసులు ముక్కున వేలేసుకున్నారు. దిశ తన వాహనాన్ని నిలిపి అక్కడ నుంచి వెళ్లిపోగానే అప్పుడే ఆమెను చెరబట్టాలని పథకం వేసినట్టు నిందితులు తెలిపినట్టు తెలుస్తోంది. రాత్రి 9 గంటల తర్వాతే రావడం వల్ల హడావుడిగా లారీలో నుంచి కిందకు దిగారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన తర్వాత అక్కడి నుంచి పారిపోవాలని మద్యం సేవిస్తూ నిర్ణయించుకున్నారు. ఆమెను చంపేసి కాల్చేస్తే ఇంత దూరం వస్తుందనుకోలేదని నిందితులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. నలుగురు నిందితుల్లో ముగ్గురి వయస్సు 20 ఏళ్లే... నలుగురికీ ఇంతకు ముందు నేర చరిత్ర లేదు.

అప్పటి వరకు ఏం చేశారు?

గతంలో తాను దొంగిలించిన ఇనుప కడ్డీలు అమ్మేందుకు రావాలంటూ నవీన్‌, చెన్నకేశవులను ప్రధాన నిందితుడు ఆరిఫ్‌ పిలిచాడు. 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విక్రయించారు. అదే రోజు రాత్రి శంషాబాద్‌ శివారుల్లోని తొండుపల్లికి చేరుకున్నారు. అక్కడి నుంచి 27వ తేదీ ఉదయం 9 గంటలకు తొండుపల్లి ఓఆర్‌ఆర్‌ జంక్షన్‌కొచ్చారు. సాయంత్రం 5.30 గంటలకు మద్యం సేవించడం ప్రారంభించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నలుగురు కలిసి ఏం చేశారన్నదే ఇప్పుడు మిస్టరీగా మారింది. లోడ్‌ దించేందుకు నలుగురు ఉండాల్సిన అవసరం లేదు కదా అనే ప్రశ్న సర్వత్రా ఉత్పన్నమవుతోంది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details