ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

ప్రొద్దుటూరులో ఆరుగురు క్రికెట్ బుకీలు అరెస్ట్ - cricket bookie

కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆరుగురు క్రికెట్ బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 2.18 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ సుధాకర్ తెలిపారు.

cricket bookie arrested at proddatur
ప్రొద్దుటూరులో ఆరుగురు క్రికెట్ బూకీలు అరెస్ట్

By

Published : Nov 4, 2020, 11:39 PM IST

కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆరుగురు క్రికెట్ బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలోని కల్పిత బుక్ స్టోరు వద్ద కొందరు క్రికెట్ బెట్టింగ్​కు సంబంధించిన డబ్బు పంచుకుంటున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే సిబ్బందితో కలిసి 2వ పట్టణ ఎస్సై నారాయణ యాదవ్ దాడులు చేశారు. ఈ దాడిలో ఆరుగురు క్రికెట్ బుకీలను అరెస్ట్ చేశారు. వాళ్ల నుంచి రూ. 2.18 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ సుధాకర్ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details