ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

అనుమానాస్పద స్థితిలో దంపతులు మృతి

విశాఖ ఏజెన్సీలోని జన్నేరులో భార్యాభర్తలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రెండు రోజుల క్రితం భార్య.. ఇవాళ భర్త మృతితో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

couple suspected death
అనుమానాస్పద స్థితిలో దంపతుల మృతి

By

Published : Nov 13, 2020, 8:09 PM IST

విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం జన్నేరులో దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. గ్రామానికి దంపతులు సోమేలి ఉపేంద్ర- చిన్నారి. కొంత కాలంగా కుటుంబ కలహాలతో వీరు గొడవలు పడుతున్నారు. ఈ నెల 12న చిన్నారి ఆకస్మికంగా మృతి చెందింది. ఇవాళ ఉపేంద్ర మృతి చెందాడు.

ఈ దంపతుల మృతి పలు అనుమానాలకు తావిస్తుంది. ముందుగా ఇద్దరూ పురుగు మందులు సేవించి మృతి చెందినట్లు పలువురు భావిస్తున్నారు. ఈ విషయమై జన్నేరులో విచారించగా పలువురు పలు విధాలుగా చెబుతున్నారు. భార్య కుటుంబీకులు కొట్టినట్లు, భార్య మృతితో రెండు రోజులుగా ఏమీ తినకతినకపోవడం వల్ల చనిపోయినట్లు సమాచారం. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

జి.మాడుగులలో బాలికపై అత్యాచారం... పోలీసుల అదుపులో నిందితుడు

ABOUT THE AUTHOR

...view details