హైదరాబాద్ వనస్థలిపురం బీఎన్ రెడ్డినగర్‌లో వెంకట్‌రెడ్డి, నిశిత దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. తమ చావుకు ఎవరు బాధ్యులు కాదని.. జీవించడం ఇష్టం లేక చనిపోతున్నామని సూసైడ్ నోట్ రాశారు. మా బాబుని మంచిగా చూసుకోండి. దయచేసి ఎవరు బాధపడకండని అందులో రాశారు. వీరికి రెండు సంవత్సరాల బాబు ఉన్నాడు. మృతులది నల్గొండ జిల్లా మాల్ మండలం కిషన్‌పల్లి.