ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

విషాదం.. చిన్నారిని హతమార్చి దంపతుల ఆత్మహత్య - mahabubabad district latest news

తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం మన్నెగూడెంలో తీవ్ర విషాదం నెలకొంది. తొమ్మిది నెలల చిన్నారితో సహా తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

couple hang 2 yr old daughter then commit suicide in mahabubabad
couple hang 2 yr old daughter then commit suicide in mahabubabad

By

Published : May 21, 2020, 10:24 AM IST

తెలంగాణలోని మహబూబాద్​ జిల్లాలోని మన్నెగూడెం గ్రామానికి చెందిన అక్కి రాంబాబు, ఆయన భార్య కృష్ణవేణి, కుమార్తె ఛైత్రిక.. ద్విచక్ర వాహనంపై... కృష్ణవేణి తల్లిగారి ఊరైన చిలుకోయలపాడు నుంచి మన్నెగూడెం బయలుదేరారు.

ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్లకుండా నేరుగా మార్గమధ్యలో చెరువు సమీపంలోని తమ వ్యవసాయ భూమి వద్దకు చేరుకున్నారు. అక్కడ తమ కుమార్తె ఛైత్రికను చంపి నీటి కుంటలో పడేశారు. అనంతరం దంపతులు ఇద్దరూ ఒక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వీరికి మరో మూడేళ్ల కుమార్తె వైష్ణవి ఉంది.

ఆత్మహత్యకు ముందు రాంబాబు తన మరదలికి ఫోన్‌ చేసి తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పగా.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలే వీరి మృతికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details