బళ్లారి నుంచి అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం బోడసానిపల్లి తండాకు దంపతులు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఉరవకొండ బైపాస్ సమీపంలోని 42వ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి గుర్తుతెలియని వాహనం వారిని ఢీకొంది. ప్రమాదంలో... మహిళ వర్లీ బాయి (26)అక్కడికక్కడే మృతి చెందగా.... ఆమె భర్త కేశవ నాయక్(28) అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఏడాదిన్నర వయసున్న వారి పాప స్వల్ప గాయాలతో బయటపడింది.
రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి.. కానీ!
లాక్ డౌన్ నేపథ్యంలో రాకపోకలను పోలీసుల అనుమతించడం లేదు. రాత్రి వేళ నిఘా తక్కువగా ఉంటుందేమో అనుకుని ఆ దంపతులు ధైర్యం చేశారు. ఏడాదిన్నర వయసున్న చిన్నారితో ప్రయాణం మొదలు పెట్టారు. రోడ్డు ప్రమాదం కారణంగా వారికి అదే చివరి ప్రయాణమైంది. చిన్నారి మాత్రం స్వల్ప గాయాలతో బయటపడింది.
రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి