ప్రకాశం జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస దొంగతనాలతో హడలెత్తిస్తున్నారు. నిందితుల వేటలో పోలీసులు ఉండగానే కొత్త చోరీ ఘటనలు ప్రజలను భయపెడుతున్నాయి. అద్దంకి నియోజకవర్గ పరిధిలోని కొరిసపాడు, పంగులూరు పట్టణ శివారు ప్రాంతాల్లో దొంగతనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంటి ముందు, బజారులో పార్కింగ్ చేసిన వాహనాలు తీసుకెళ్లిపోతున్నారు. పంటపొలాల వద్ద విద్యుత్ పరికరాలు సైతం మాయమవుతున్నాయి.
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా
తాళాలు వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని... రాత్రి పూట దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఒకవైపు పోలీసులు హైవే పెట్రోలింగ్ నిర్వహిస్తున్నా దొంగతనాల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.