అనంతపురం జిల్లా చెన్నై కొత్తపల్లి మండలం మేడాపురం గ్రామంలో సెంట్రింగ్ కుప్పకూలి భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. మృతుడిని సురేంద్రగా గుర్తించారు. మరో కార్మికుడు శ్రీనివాసులు తీవ్రంగా గాయపడ్డాడు నూతనంగా నిర్మించిన భవనానికి సెంట్రింగ్ పనులు పూర్తి కావడంతో కర్రలు తొలగించే సమయంలో సెంట్రింగ్ కూలింది.
తీవ్రంగా గాయపడిన సురేంద్ర, శ్రీనివాసులను ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సురేంద్ర మృతి చెందాడు. మృతునికి భార్య జానకి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. గాయపడిన శ్రీనివాసులను మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చెన్నేకొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.