గ్యాంగ్ వార్: మార్కాపురంలో యువకుల మధ్య ఘర్షణ - praksham district crime news
మార్కాపురంలో యువకుల మధ్య ఘర్షణ గ్యాంగ్ వార్‌ను తలపించింది. ఓ యువకుడిపై దాడి చేసిన ఇద్దరు యువకులను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు.
మార్కాపురంలో యువకుల మధ్య ఘర్షణ
ప్రకాశం జిల్లా మార్కాపురంలో యువకుల మధ్య ఘర్షణ గ్యాంగ్ వార్‌ను తలపించింది. మళ్లీ, కాశీ అనే ఇద్దరు యువకులతో సహా మరో నలుగురు కలిసి.... రామిరెడ్డి అనే యువకుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడి చేసిన గ్యాంగ్‌ను 10వ వార్డు కాలనీవాసులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.