ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

'మాకేం తెలియదు... అంతా చైనా వాళ్లే చేశారు' - హైదరాబాద్​లో చైనా బెట్టింగ్​ స్కామ్ తాజా వార్తలు

పదకొండు వందల కోట్ల ఆన్​లైన్​ బెట్టింగ్​ స్కాంలో నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో తమకేమీ తెలియదని... అంతా చైనాకు చెందిన మరో నలుగురు ప్రధాన సూత్రదారులే చేశారని నిందితులు వెల్లడించారు.

china-betting-scam-update
china-betting-scam-update

By

Published : Sep 23, 2020, 11:59 PM IST

సంచలనం సృష్టించిన రూ.11 వందల కోట్ల ఆన్​లైన్ బెట్టింగ్ స్కాంలో నలుగురు నిందితులను 8 రోజుల పాటు ఎన్ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ కస్టడీలోకి తీసుకుంది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 4 రోజుల విచారణ అనంతరం ఈరోజు బషీర్​బాగ్​లోని ఈడీ కార్యాలయానికి నిందితులను తరలించారు.

తమకు ఏమి తెలియదని చైనాకి చెందిన వ్యక్తులే అంతా చేశారని సీసీస్ పోలీసుల విచారణలో నిందితులు తెలిపారు. చైనాకి చెందిన నింగ్​యాంగ్, డింగ్​యాంగ్, లింగ్​లింగ్​యాంగ్, యాన్​హౌ అనే మరో నలుగురు నిందితులు ఈ స్కాంలో ప్రధాన సూత్రదారులని పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించారు. చైనాకి చెందిన ప్రధాన నిందితులను అరెస్ట్ చేస్తేనే ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details