ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

చిరుత పులి సంచారం.. స్థానికుల పరేషాన్ - ఎల్లారెడ్డి మండలంలో మేకపై చిరుత దాడి

తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారం గుబులు రేపుతోంది. ఎల్లారెడ్డి మండలంలో ఆదివారం మధ్యాహ్నం మేకపై దాడి చేసి చంపేసింది. దీంతో గ్రామస్థులు భయాందోళనకి గురవుతున్నారు.

cheetah-attack-on-goat
cheetah-attack-on-goat

By

Published : Nov 29, 2020, 8:41 PM IST

తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. ఆదివారం ఉదయం నుంచి పులి వివిధ ప్రాంతాల్లో సంచరిస్తుండటం స్థానిక ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తోంది. సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామ శివారులో ఓ పశువుల కాపరి.. చిరుతను చూసి అటవీ శాఖ అధికారులకు, గ్రామస్థులకు సమాచారం అందించాడు.

మధ్యాహ్నం సమయంలో ఎల్లారెడ్డి మండలం వెల్లుట్లపేటలో మేకల మందపై చిరుత దాడి చేసి ఒక మేకను చంపేసింది. చిరుత దాడితో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details