ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

ఎస్సై పేరిట నకిలీ ఫేస్ బుక్ ఖాతా... హెడ్ కానిస్టేబుల్‌కు టోకరా - ఎస్సై నకిలీ ఫేస్‌బుక్‌ ఐడీతో మోసం వార్తలు

విజయవాడలో తాజాగా మరో సైబర్ మోసం బయటపడింది. ఓ ఎస్సై పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఖాతా సృష్టించి... హెడ్ కానిస్టేబుల్ ను బురిడీ కొట్టించి లక్ష రూపాయలకు టోకరా పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

cheating
cheating

By

Published : Sep 16, 2020, 8:48 AM IST

ఎస్సై పేరు మీద నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా సృష్టించి... రూ.లక్ష మేర హెడ్‌ కానిస్టేబుల్‌ను బురిడీ కొట్టించిన ఘటన అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఇందిరానాయక్‌నగర్‌లో వెలుగు చూసింది. సిటీగార్డ్స్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఇసుకపల్లి బాలగురుప్రసాద్‌రెడ్డికి ఈ నెల 11న తనకు బాగా పరిచయం ఉన్న జయన్న అనే సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పేరుతో ఉన్న ఫేస్‌బుక్‌ ఐడీ నుంచి మెసేజ్ వచ్చింది. ఆయనతో కాసేపు గురుప్రసాద్‌రెడ్డి ఛాటింగ్‌ చేశారు.

తనకు రూ.లక్ష అవసరమని, డబ్బులు పంపు, సాధ్యమైనంత త్వరగా తిరిగిచ్చేస్తానని ఎదుటి వ్యక్తి బ్యాంకు ఖాతా పంపాడు. నగదు పంపేందుకు సిద్ధమైన గురుప్రసాద్‌రెడ్ఢి... ఒకసారి మాట్లాడదామని ఎస్సైకి ఫోన్‌ చేయగా, అది పనిచేయలేదు. అయినా... తనకు బాగా తెలిసిన ఎస్సై అయ్యేసరికి రూ.లక్షను రెండు దఫాలుగా ఆన్‌లైన్‌లో పంపాడు. కొద్దిసేపటి తర్వాత రూ.లక్ష అందాయా లేదా అని తెలుసుకునేందుకు ఎస్సై జయన్నకు ఫోన్‌ చేయగా, డబ్బు ఏంటంటూ ఎస్సై ప్రశ్నించాడు.

జరిగిన విషయాన్ని గురుప్రసాద్‌రెడ్డి చెప్పగా.. ఎవరో తన పేరు, ఫొటోతో నకిలీ ఫేస్‌బుక్‌ ఐడీ తయారుచేసి, మోసాలకు పాల్పడుతున్నాడంటూ చెప్పారు. తాను మోసపోయానని తెలుసుకున్న హెడ్‌కానిస్టేబుల్‌... సదరు ఎస్సై సూచనల మేరకు... పూర్తి వివరాలతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

ఇదీ చదవండి:

విజయవాడ దుర్గమ్మ వెండి రథం సింహాల ప్రతిమలు అదృశ్యం?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details