పెళ్లి సంబంధం పేరుతో ఎన్ఆర్ఐ యువకుడిని మోసం చేసిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. తెనాలికి చెందిన యువకుడు అమెరికాలో ఉంటున్నారు. వివాహం కోసం ఓ పెళ్లి సంబంధాల వెబ్సైట్లో పేరు నమోదు చేసుకున్నాడు. మైనేని సముద్ర అనే యువతి.... యువకుడితో సంప్రదింపులు జరిపింది. తాము చెన్నైలో స్థిరపడిన తెలుగు కుటుంబమని చెప్పి.... మద్రాసు వెటర్నరీ కళాశాలలో తన తల్లిదండ్రులు ఫ్రొఫెసర్లుగా పని చేస్తున్నట్లు నమ్మించింది.
ఫొటోలు చూసి అమ్మాయి నచ్చటంతో యువకుడు పెళ్లికి సరేనన్నాడు. తెనాలిలో ఉంటున్న తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. పెళ్లి కోసం ఇండియాకు వచ్చాడు. ప్రకాశం జిల్లా ఉలవపాడు తమ స్వగ్రామమని... అక్కడే నిశ్చితార్థమని చెప్పటంతో యువకుడు నమ్మాడు. ఈలోగా నగలు, చీరలు కొనుగోలు పేరుతో యువకుడి నుంచి 7.20 లక్షలు తన అకౌంట్లో వేయించుకుంది. తన ఏటీఎం కార్డు సమస్య అంటూ కబుర్లు చెప్పింది. ఐదారు విడతలుగా డబ్బులు ఆమె చెప్పిన అకౌంట్లో వేశాడు యువకుడు.